సొంత స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేయడం జరిగింది.
తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికి అవకాశం ఇస్తామని ప్రకటన చేశారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ, మండల స్థాయి అధికారులు బాధ్యులుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ లోటుపాట్లు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని సీఎం సూచనలు చేశారు. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.