లోక్ సభ ఎన్నికల శంఖం పూరించిన సీఎం రేవంత్ రెడ్డి

-

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల శంఖం పూరించారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాహుల్ గాంధీ నానమ్మ, నాన్న ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ల అమ్మ ఈ దేశం కోసం పదవి త్యాగం చేశారు. అలాంటి గొప్ప నాయకుడు, ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కావాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఆదిలాబాద్ ఎంపీని గెలిపిస్తారు కదా? మీరందరూ సిద్ధమేనా?’ అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

ఇక.. రేవంత్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,కొండా సురేఖ, సీతక్క ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version