Breaking : రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర సీఎం

-

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. అయితే.. మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభంపై శివ‌సేన అధినేత‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక‌రే బుధ‌వారం సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ప‌ద‌వి కోసం పోరాటం చేసే వ్య‌క్తిని కాద‌ని థాక‌రే స్ప‌ష్టం చేశారు. తానేమీ సీఎం కావాల‌ని కోరుకోలేద‌ని, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ అభీష్టం మేర‌కే తాను ముఖ్య‌మంత్రి ప‌ద‌విని స్వీక‌రించాన‌ని చెప్పుకొచ్చారు ఉద్ధవ్ థాక‌రే.

సీఎంగా తాను స‌మ‌ర్థంగానే ప‌నిచేశాన‌ని కూడా తెలిపారు ఉద్ధవ్ థాక‌రే. హిందూత్వ అనేది త‌మ పార్టీ సిద్ధాంత‌మ‌న్న థాక‌రే… దానిని పార్టీ గానీ, తాము గానీ ఎప్పుడూ వ‌దిలిపెట్ట‌లేద‌ని చెప్పారు. సీఎం ప‌ద‌వికి తాను స‌రిపోన‌ని పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తే ప‌ద‌వి నుంచి దిగిపోయేందుకు తాను సిద్ధ‌మేన‌ని కూడా ప్ర‌క‌టించారు ఉద్ధవ్ థాక‌రే. ఈ విష‌యాన్ని ఒక్క ఎమ్మెల్యే చెప్పినా… మ‌రుక్ష‌ణ‌మే తాను ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని థాక‌రే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం ప‌ద‌వికి రాజీనామా లేఖ‌ను త‌న వ‌ద్దే సిద్ధంగా ఉంచుకున్నాన‌ని కూడా ఉద్ధవ్ థాక‌రే ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version