రేవంత్ రెడ్డి పై సుమోటోగా కేసు పెట్టాలి..!

-

రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాష సరైంది కాదని అన్నారు మాట్లాడే భాష పై సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని అన్నారు. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ఉన్మాద భాష మాట్లాడుతున్నారని అన్నారు 90 రోజుల నుండి రేవంత్ రెడ్డి మాట్లాడే భాషని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు బొంద పెడతాం మానవ బాంబులయితం పండబెట్టి తొక్కుతాం అని రేవంత్ రెడ్డి అంటున్నారని ఈ స్థాయిలైన వారు కూడా చాలామంది కెసిఆర్ పై మాట్లాడుతున్నారని అన్నారు.

మేము ఎవరిని ఏమీ అనలేదని అన్నారు తాము ప్రభుత్వాన్ని పడగొడతామని ఎక్కడా చెప్పలేదని అన్నారు. రేవంత్ రెడ్డి పక్కన ఉండే వాళ్లతోనే ఆయనకి ప్రమాదం ఉంది అన్నారు అందుకే అలా మాట్లాడుతున్నారని చెప్పారు పాలమూరు వలసలు పచ్చగా చేసిన ఘనత కేసిఆర్ ది అని అన్నారు పాలన మీద దృష్టి పెట్టకుండా కేసీఆర్ ని తిట్టడానికి చూస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version