కామన్‌వెల్త్ గేమ్స్: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

-

కామన్‌వెల్త్ గేమ్స్ లో మొదటిసారిగా క్రికెట్‌ను ఆడబోతున్నారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు బర్మింగ్ హోమ్ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ జట్లు (మహిళల) పోటీలో పాల్గొననున్నారు. దీంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానులకు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు. జులై 31వ తేదీన భారత్-పాకిస్తాన్ మహిళా జట్టుకు మ్యాచ్ జరగనుంది.

భారత్-పాకిస్తాన్ క్రికెట్ మహిళల జట్టు

మహిళల క్రికెట్ జట్లు మాత్రమే కామన్‌వెల్త్ గేమ్స్ లో పోటీ పడుతున్నాయి. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బోడన్ జట్లు కూడా మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ను వేర్వేరు ప్రత్యర్థులతో ఆడుతున్నా.. రెండో మ్యాచ్‌లో ఢీకొననున్నాయి. టీ20 ఫార్మాట్‌లో మ్యాచులు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, జులై 31న హర్మన్ ప్రీత్ సేన పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్‌ సారథ్యంలో మ్యాచ్ జరగబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version