ఆగస్ట్ 9న దళిత దండోరా యాత్ర ప్రారంభం : రేవంత్

-

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వపై తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ జెండా దించకుండా మోసిన వారే తన బంధువులు అని.. ఏపీలో కాంగ్రెస్ ను చంపుకుని సోనియా తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి అని… రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా తెలంగాణ ఇవ్వలేదన్నారు.

కానీ సోనియా రాష్ట్రం ఇచ్చినప్పటికీ…తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదని… ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దివాళా తెలంగాణగా మార్చారని నిప్పులు చెరిగారు. దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాల్లో వేసుకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆగస్ట్ 9నుంచి సెప్టెంబర్ 17వరకు దళిత గిరిజన దండోరా మోగిస్తామని… ఆగస్టు 9న ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దండోరా మోగిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రతీ మనిషిమీద లక్ష రూపాయల అప్పు తెచ్చారని… ఉప ఎన్నికలొస్తేనే కేసీఆర్ కు పథకాలు గుర్తుకొస్తున్నా యని మండిపడ్డారు. కోటి ముప్పై ఐదు లక్షల మంది దళిత, గిరిజనుల కు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version