కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పై బురద జల్లే ప్రయత్నం…మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్

-

విద్యుత్‌ విచారణ కమిషన్‌పై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . విచారణ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది అని ఫైర్ అయ్యారు. ప్రజాధనం దుర్వినియోగం జరగలేదు.. ఒప్పందాల మేరకే ప్రాజెక్టులు జరిగాయని కేసీఆర్ లేఖ రూపంలో పేర్కొన్నారు. నియమాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరిస్తుంది. కమిషన్ న్యాయ బద్దంగా విచారణ చేయాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా వివక్ష లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలి” అని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్‌ ఇచ్చాం. బండి సంజయ్‌కు కనీస పరిజ్ఞానం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ ఒక్కటే. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటేనని 5 సంవత్సరాల నుంచి చెబుతున్నాం” అని జగదీష్‌రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version