కేటీఆర్ ను కలిసిన కౌశిక్ రెడ్డి..ఫోటో వైరల్ ?

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేయగా, రేపు ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈటల ఎపిసోడ్ తో తెలంగాణ రాజ‌కీయాలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. హుజూరాబాద్ లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని తెలంగాణ ప్రజలంతా చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా ఈటెల రాజేందర్ ను ఒంట‌రి చేయాల‌ని టీఆర్ఎస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈటల రాజీనామతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమే. దీంతో టీఆర్ఎస్ తమ అభ్యర్థి కోసం ఇప్పటికే ఇతర పార్టీ నేతలపై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరినట్లు..ఈ మేరకు కేటీఆర్ ను కలిసినట్లు ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు.. కేటీఆర్ ను కౌశిక్ రెడ్డి కలిసినట్లు ఓ ఫోటో కూడా వైరల్ అయింది. దీంతో అందరూ అది నిజమే అనుకున్నారు. అయితే దీనిపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను టీఆర్ఎస్ లో చేరుతున్నా అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపారు కౌశిక్ రెడ్డి. టీఆర్ఎస్ లోకి చేరుతున్న అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని..మిత్రుడి ఇంట్లో నిన్న ఓ కార్యక్రమంలో కేటీఆర్ గారిని కలవడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. కలిసిన సందర్భంలో ఎటువంటి రాజకీయ పరమైన అంశాలు రాలేదు ఆయన తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు దీనిని గమనించగలరు అని పేర్కొన్నాడు కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version