పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ : హరీశ్ రావు

-

పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు నిన్న రాత్రి సిద్దిపేటలో హరీశ్ రావుకు వ్యతిరేకంగా ప్లెక్సీలు, నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న రూ.2లక్షలు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే.. రుణమాఫీ అందరికీ జరగలేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. తాజాగా రుణమాఫీ పై హరీశ్ రావు స్పందించారు.

రుణమాఫీ పై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. పూర్తి రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి నిరూపిస్తే దేనికంటే దానికి సిద్దమని తెలిపారు. కోడంగల్ నియోజకవర్గంలోనైనా.. కొండారెడ్డి పల్లి గ్రామంలోనైనా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా రుణమాఫీ చేశానని నిరూపించాలన్నారు. గతంలో కోడంగల్ లో రేవంత్ రెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాట వాస్తవం కాదా..? సవాల్ ప్రకారమే రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించారా..? అని నిలదీశారు. రాష్ట్రంలో సంపూర్ణ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పానని.. రైతుల కంటే తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. దమ్ముంటే వాస్తవ లెక్కలతో రుణమాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version