మెచ్చాని టార్గెట్ చేసిన కాంగ్రెస్…చెక్ పెడతారా?

-

తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ని వీడి టి‌ఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి మంత్రి కూడా అయ్యారు. అయితే మొదట్లో ఈ జంపింగ్‌లపై కాంగ్రెస్ పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి పి‌సి‌సి పీఠం దక్కించుకున్నాక, జంపింగ్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేశారు. టి‌ఆర్‌ఎస్‌లోకి వెళ్ళినవారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ని కోరారు. కోర్టుకు కూడా వెళ్తామని మాట్లాడారు. అలాగే పార్టీ మారిన వారిని రాళ్ళతో కొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

అటు జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌కు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అయితే జంపింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కడకక్కడ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతూనే ఉన్నాయి. వారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు టి‌డి‌పి జంపింగ్ ఎమ్మెల్యేలని కూడా టార్గెట్ చేశారు. తాజాగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని సైతం కాంగ్రెస్ శ్రేణులు టార్గెట్ చేశాయి.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు చేశారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై రాళ్ళతో దాడి చేశారు. కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. ఇక దీనిపై మెచ్చా కూడా సీరియస్‌గానే స్పందించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయవచ్చని, కానీ ఇలా భౌతిక దాడులకు దిగకూడదని అన్నారు.

అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా అశ్వరావుపేట నుంచి మెచ్చా టి‌డి‌పి తరుపున పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఇటీవలే ఆయన టి‌ఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు మెచ్చాని టార్గెట్ చేశాయి. నెక్స్ట్ ఎన్నికల్లో మెచ్చాని ఓడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మరి చూడాలి అశ్వరావుపేటలో మెచ్చాకు కాంగ్రెస్ చెక్ పెట్టగలదో లేదో?

Read more RELATED
Recommended to you

Exit mobile version