Big Boss Telugu Non Stop: ఆరోవారం అత్యధిక నామినేషన్స్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్..

-

తెలుగు బిగ్ బాస్ ఓటీటీ షోలో నామినేషన్స్ పర్వం స్టార్ట్ అయింది. సోమవారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ నుంచి అత్యధిక నామినేషన్స్ వచ్చాయి. రీజన్స్ చెప్తూ కంటెస్టెంట్స్ నామినేషన్స్ వేశారు. ఈ క్రమంలోనే హౌస్ సభ్యుల మధ్య ఘర్షణ షురూ అయింది. ఓటింగ్ లో అతి తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ సొంతం చేసుకుని ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అలా ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ అయితే జరిగింది.

హౌస్ లో నామినేషన్స్ సందర్భంగా నెవర్ బిఫోర్ డిస్కషన్స్ అయితే జరిగాయి. మిత్రశర్మ ఈ ఎపిసోడ్ లో ఒకేసారి ఎనిమిది మందిని నామినేట్ చేయడం గమనార్హం. నామినేట్ చేయడానికి గల కారణాలు చెప్తున్న క్రమంలో ‘బిగ్ బాస్’ ఒకోసారి స్పందించి, సరైన కారణం చెప్పాలని అడిగారు.

ఇక కంటెస్టెంట్స్ కు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే అందులో బిందు మాధవి టాప్ పొజిషన్ లో ఉంది. 31 శాతం ఓటింగ్ ఆమెకు రాగా, ఆ తర్వాత స్థానంలో యాంకర్ శివ ఉన్నారు. ఆ తర్వాత పొజిషన్ లో ఉన్న మిత్ర శర్మ.. ఈ సారి ఎనిమిది మందిని నామినేట్ చేసింది.

ఓటింగ్ పర్సంటేజ్ ఇద్దరికి ఒకే శాతం ఈ సారి వచ్చింది. ఆ కంటెస్టెంట్స్ మహేశ్, అజయ్. కాగా, నటరాజ్ మాస్టర్ కు ఆరు శాతం ఓటింగ్ వచ్చింది. ఇక డేంజర్ జోన్ లో ముమైత్ ఖాన్, శ్రవంతి ఉన్నారు. ముమైత్ ఖాన్ ను బిగ్ బాస్ షోకు ‘బిగ్ బాస్’ కావాలని మళ్లీ మళ్లీ తీసుకొస్తున్నాడనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది.

ఆమె ‘బిగ్ బాస్’కు ముద్దు బిడ్డ అయిపోయిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. ప్రేక్షకులు ఆమెపైన చిరాకు పడక ముందే ఆమెను హౌస్ నుంచి ఎలిమినేట్ చేయాలని పలువురు అనుకుంటున్నారు. శ్రవంతి కూడా డేంజర్ జోన్ లో ఉంది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version