ప్రస్తుతం రష్యా చైనాలో ఏవై 4 కరోనా వేరియంట్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. రష్యాలో రోజుకు వేయిపైగా మరణాలు ముప్పై వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఈ రకం వేరియంట్ మధ్య ప్రదేశ్ లో కలకలం రేపింది. మధ్యప్రదేశ్ లోని ఆరుగురు వ్యక్తులు ఏవై వేరియంట్ భారిన పడినట్టు తెలుస్తోంది. మరోవైపు వైరస్ సోకినవారంతా వ్యాక్సిన్ తీసుకున్న వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆరుగురికి ఏవై 4 సోకినట్టు ఢిల్లీలోని జాతీయ వ్యాధి నిర్ధారణ కేంద్రం నిర్ధారించింది.
ఐవై 4 కరోనా వేరియంట్ జన్యు క్రమాన్ని నిర్ధారించేందుకు ల్యాబ్ కు పంపించారు. ఇక ప్రస్తుతం ఈ వేరియంట్ భారినపడిన వాళ్లు కోలుకుంటున్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మధ్యప్రధేశ్ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఇదిలా ఉండగా మనదేశంలో కరోనా కేసులు రోజుకు14 నుండి 16 వేల మధ్యన నమోదలు అవుతున్నాయి. ఈ క్రమంలో ఐవై 4 వేరియంట్ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.