గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వివరాలు ఇవే..!

-

కరోనా మహమ్మారి తగ్గుతుందని ఎదురు చూస్తున్నా.. ఇంకా వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే వున్నాయి. అలానే వందల్లో చనిపోతున్నారు. ఈ మహమ్మారి బారి నుండి బయట పడడానికి అందరు ఎదురుచూస్తున్నా ఇంకా కరోనా వైరస్ పూర్తిగా తగ్గడం లేదు.

మరొక వైపు మూడవ వేవ్ కూడా వస్తుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా కొన్ని చోట్ల చిన్నారుల్లో కూడా కరోనా వైరస్ గుర్తించారు. ఏది ఏమైనా ఇంకా ప్రతీ ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించడం, బయటకు వెళ్తే మాస్క్ ధరించడం వంటి కనీస జాగ్రత్తలని తీసుకుంటే మంచిది.

ఇది ఇలా ఉంటే వందల్లో మరణాలు ఇంకా చోటు చేసుకుంటున్నాయి. వాటి వివరాలలోకి వెళితే.. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 518 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 413609 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది. గత 24 గంటల్లో 41157 కరోనా కేసులు నమోదయ్యాయి.

అలానే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికి 40 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక గత 24 గంటల్లో 5101567 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

కరోనా నుండి ఎంత మంది కోలుకున్నారు అనేది చూస్తే… దేశంలో మరో 42004 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30269796 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది. అలానే ఇంకా 4,22,660 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news