ఆ ప‌ది రాష్ట్రాల్లోనే క‌రోనా కేసులు.. హెచ్చ‌రించిన కేంద్రం

-

క‌రోనా తీవ్ర‌త దేశంలో ఏ స్థాయిలోఉందో అంద‌రికీ తెలిసిందే. అయితే కేసులు కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న‌ట్టు కేంద్రం గుర్తించింది. ఈ మేర‌కు ఈ రోజు కేంద్రం కీల‌క ప్రక‌ట‌న చేసింది. క‌రోనా కేసులు కేవ‌లం ప‌ది రాష్ట్రాల్లోనే ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని తెలిపింది.

దేశంలో న‌మోద‌వుతున్న కేసుల్లో 72.19శాతం కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఢిల్లీ, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ బెంగాల్‌, రాజ‌స్థాన్ ల‌లో మాత్ర‌మే న‌మోద‌వుతున్నాయ‌ని తెలిపింది. కాబ‌ట్టి ఆ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version