దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులుగా దేశంలో వెయ్యికి అటూ ఇటూగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా దాదాపుగా తగ్గాయి. కాగా హర్యానా, ఢిల్లీల్లో స్వల్పంగా కేసులు పెరుగుదల కాస్త ఆందోళన పెంచుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో హర్యానా సర్కార్ మాస్క్ ను తప్పని సరి చేసింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1247 కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతి చెందారు. నిన్నటి తో పోలిస్తే ( 2,183 కేసులు) చాలా వరకు కరోనా కేసులు తగ్గాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,860 ఉన్నాయి. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి 5,21,966 మంది కరోనా బారిన పడి చనిపోయారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,25,11,701 గా ఉంది. దేశ వ్యాప్తంగా అర్హులైన వారందరికీ 186 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేస్ లోడు 0.03 శాతంగా ఉంది. రికవరీ రేట్ 98.76 శాతంగా, డెత్ రేట్ 1.21 శాతంగా ఉంది.