చిత్తూరు జిల్లాను కరోనా కబలించి వేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 49 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా.. తిరుపతి ఐఐటీ లో 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బంది సైతం కరోనా బారీన పడ్డారు. దీంతో ఒక్క సారి జిల్లాలో ఆందోళన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత ఈ నెల 17 వ తేదీన పాఠశాలలు ప్రారంభం అయ్యాయి.
అప్పటి నుంచి 219 మంది ఉపాధ్యాయులకు, 11 మంది విద్యార్థు లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక తాజాగా 49 మంది ఉపాధ్యాయులకు, తిరుపతి ఐఐటీలో 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్ రావడంతో.. తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. మరో వైపు చిత్తూరు జిల్లాలో కొత్త 1565 కరోనా కేసులు నమోదు అయ్యాయని అధికారులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. దీంతో ఆ జిల్లా లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,951 కి చేరుకుంది.