గిరిజనుల మెడపై కత్తి పెట్టేందుకే ముర్మును బీజేపీ వాడుకుంటోంది.. సీపీఐ నారాయణ మరో సంచలనం

-

సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ.. అనంతరం క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ఇలా ఫుల్ స్టాప్ పడిందో లేదో.. మరోసారి సంచనల కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ. ఆదివారం మంచిర్యాల జిల్లాలో జరిగిన సీపీఐ మహాసభల్లో ప్రధాని మోదీ, బీజేపీని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలాలని చూస్తున్నారన్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉంటే, దేశాన్ని అమ్ముకోనివ్వరనే వరవరరావు, సాయిబాబా లాంటివారిని జైల్లో పెట్టారని ఆరోపించారు సీపీఐ నారాయణ. అంతేకాకుండా.. ‘ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసి, గొప్పులు చెప్పుకుంటున్నారు సీపీఐ నారాయణ. ముర్ము రాష్ట్రపతి అయితే గిరిజనుల జీవితాలు ఎలా మారిపోతాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు సీపీఐ నారాయణ.

నిజంగానే అలాంటి పరిస్థితి ఉంటే, ముందు మంచిర్యాల జిల్లాలోని గిరిజనుల సమస్యను పరిష్కరించాలని, ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేయడం కాదు, ముందు గిరిజనుల సమస్యలపై దృష్టి పెట్టండని సీపీఐ నారాయణ హితవు పలికారు. అప్పుడైనా, ఇప్పుడైనా గిరిజనుల హక్కుల కోసం పోరాడుతోన్న ఒకే ఒక్క పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. గిరిజనుల మెడపై కత్తి పెట్టేందుకే ముర్మును బీజేపీ వాడుకుంటోందని సీపీఐ నారాయణ మండిపడ్డారు. ఇప్పటికే 24 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలను అమ్మేశారు, ఇప్పుడు మరో వంద సంస్థలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. 89మంది బ్యాంకులకు అప్పులు ఎగ్గొడితే, అందులో 29మంది గుజరాతీలే ఉన్నార’ని విమర్శించారు. ఇక తెలంగాణలోనూ నియంత పాలన నడుస్తోందన్నారు నారాయణ. వరద బాధితులను ఆదుకోకపోతే సీపీఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు సీపీఐ నారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version