మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2021కు నామినేట్ అయిన క్రికెటర్ల పేర్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ అవార్డు కోసం పాకిస్తాన్ నుంచి షాహీన్ ఆఫ్రీది, మహమ్మద్ రిజ్వాన్ నామినేట్ అయ్యరు. మరో ఇద్దరు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కనె విలియమ్సన్. విజేతగా నిలిచిన క్రికెటర్‌కు సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందజేస్తారు. ఈసారి భారత జట్టు నుంచి ఒక్క క్రికెట్ కూడా నామినేట్ కాకపోవడం గమనార్హం.
జో రూట్ – ఇంగ్లాండ్
18 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 58.37 సగటుతో 1855 పరుగులు చేశాడు. ఆరు సెంచరీలను నమోదు చేశాడు.
షాహీన్ ఆఫ్రీది – పాకిస్తాన్
36 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 22.20 సగటుతో 78 వికెట్లు తీశాడు. బెస్ట్ 6/51
కన్నె విలియమ్సన్ – న్యూజిలాండ్
16 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 43.31 సగటుతో 693 పరుగులు చేయగా, అందులో ఒక సెంచరీ ఉన్నది
మహమ్మద్ రిజ్వాన్ – పాకిస్తాన్
44 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 56.32 సగటుతో 1915 పరుగులు చేశాడు. 56 వికెట్లు తీశాడు.