ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ అక్కడికక్కడే మరణించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా సంబేపల్లె మండలం యర్రగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సుగాలి రమ కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి ప్రభుత్వం అండగా ఉండి మెరుగైన చికిత్స అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కాగా, రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.