వివేకా హత్య కేసులో లేటెస్ట్ అప్ డేట్ ఇదే!

-

మాజీ మంత్రి, సీఎం వైఎస్‌ జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తుతం సీబీఐ చేతిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మొదట్లో టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డితో పాటు టీడీపీ నేతలూ, వివేకా కుటుంబ సభ్యులూ ఈ విషయంలో సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేసిన సంగతీ తెలిసిందే. దీంతో రంగ ప్రవేశం చేసిన సీబీఐ.. తన దర్యాప్తున్ను వేగవంతం చేసింది!

ఈ క్రమంలో వైఎస్‌ వివేకానందరెడ్డి ఇల్లు, పరిసరాల్లోనే రోజంతా గడిపిన సీబీఐ బృందం… ఇంటినీ, పరిశరాలను, బౌడరీలను క్షుణ్నంగా పరిశీలించింది. ఇదే క్రమంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి తీసుకున్న బ్లూప్రింట్‌ ఆధారంగా ఇంటి చుట్టుకొలతలు మరోసారి పరిశీలించడం గమనార్హం. ఇదే క్రమంలో… ఇంట్లో ఉన్న వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ సునీతలతో పాటు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి, వంటమనిషి కొడుకు ప్రకాశ్, వాచ్ మేన్ రంగయ్యలను కూడా సీబీఐ విచారించింది.

ఇదే క్రమంలో… ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను విచారించినట్లుగా కథనాలు వస్తోన్న నేపథ్యంలో… ఆయన బ్రతికున్నంతకాలం ఆయనతో ఎక్కువగా వెంట ఉంటూ వచ్చిన నేతలను ఒక్కొక్కరిని.. వివేకా ఇంటికి పిలిపించి సీబీఐ విచారణ జరిపింది. కాగా… ఈ బృదంలో 25 నుంచి 30 మందిదాకా సీబీఐ అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది!

Read more RELATED
Recommended to you

Exit mobile version