ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

-

ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లా అధికార వైసీపీ పార్టీ నేత హత్య కలకలం రేపింది. దోర్నాల మండలం నల్లగుంట్ల సర్పంచ్‌ భర్త, వైసీపీ నేత మొద్దు వెంకటేశ్వర్లు దోర్నాల నుంచి బైక్‌ పై నల్లగుంట్ల వెళుతుండగా.. మార్గం మధ్యలో. గుంటూరు- కర్నూలు జాతీయ రహదారిపై కొర్రపోలు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి.. మారణాయుధాలతో దాడి చేసి పరారయ్యారు.

రక్తమడుగులో పడి ఉన్న బాధితుడ్ని,,,, అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి వెంటనే 108 కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్య శాలకు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో చనిపోయారు.

ఈ ఘటన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. హత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆయనను ప్రత్యర్థులే చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌ భర్తను దారుణంగా హత్య చేయడంతో.. స్థానికంగా కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version