పంటల బోనస్ బోగస్ గా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఖమ్మం జిల్లాలో రైతులతో కలిసి పర్యటించి మీడియాతో మాట్లాడారు. పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దేనికి బోనస్ ఇవ్వడం లేదు. కరోనా కష్టకాలంలో కూడా జీతాలు బంద్ చేసిండు.. రైతులకు మాత్రం రైతుబంధు ఇచ్చి చూపించిండు కేసీఆర్. రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తానన్నాడు అన్ని ఎగ్గొట్టాడు. అడిగితే దబాయిస్తున్నాడు. ఇగురం లేని వ్యవసాయం చేస్తే.. వడ్లు వానలో, గడ్డి గాలిలో కొట్టుకుపోయినట్టు రేవంత్ రెడ్డి పాలన ఉంది. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేత రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ మాట అంటే కేసు పెడతడంటా.. పెట్టుకో నేను అంటూనే ఉంటాను. మూసీ మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి కంపు ఎక్కువైపోయింది. అదానీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి, గల్లీ కాంగ్రెస్ ఒకటి అన్నారు. అదానీ దగ్గర రూ.100 కోట్లు తెచ్చిండు.. రేవంత్ రెడ్డిని ఏం చేయాలో రాహుల్ గాంధే చెప్పాలి. రాహుల్ గాంధీతో అంతర్గత ఒప్పందాలు చేసుకున్నాడు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో అదానీని అడుగుపెట్టనిచ్చిండా..? అదానీ అంటే క్లారిటీ ఉంది కాబట్టి తెలంగాణకు దూరం పెట్టిండు. అదానీ ఎవరెవరికీ లంచాలు ఇచ్చిన వారందరినీ అరెస్ట్ చేయాలంటున్నారు.