Custody OTT: ‘కస్టడీ’ డిజిటల్ రిలీజ్ ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే..

-

 

థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో ఫ్లాపులు మూటగట్టుకున్న యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమాతో ఇటీవలే థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమా ద్వారా అయినా హిట్ కొట్టాలని ప్రయత్నించిన చైకి ఈసారీ నిరాశే ఎదురైనట్లు కనిపిస్తోంది. తమిళ డైరెక్టర్​ వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన కస్టడీ మే 12న థియేటర్లలో రిలీజై డీసెంట్​​ టాక్​ను అందుకుంది.

అయితే ఈ సినిమా ఫలితంపై మిశ్రమ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొంతమంది బాగుందని అంటుంటే మరికొంతమంది మాత్రం ఆశించిన స్థాయిలో లేదని కూడా అంటున్నారు. అయితే.. తాజాగా ‘కస్టడీ’ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ ఫాం ఫిక్స్‌ అయింది. నెట్‌ ఫ్లిక్స్‌ ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు టాక్‌. అయితే.. ఎంత ధర అనేది తేలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ నుంచి నెల రోజుల లోపే స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news