నేడు సీడ‌బ్యూసీ స‌మావేశం.. 5 రాష్ట్రాల ఓట‌మిపై చ‌ర్చ

-

ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాభవాన్ని చ‌వి చూసింది. పంజాబ్ లో అధికారాన్ని కోల్పోవ‌డ‌మే కాకుండా.. ఉత్త‌ర ప్ర‌దేశ్, ఉత్త‌రా ఖండ్, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీకి క‌నీస పోటీ ఇవ్వ‌లేక పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో నాయ‌కత్వంలో తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సొంత పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులే.. పార్టీ నాయ‌కత్వంపై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓట‌మిపై అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది. ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై చర్చించ‌డానికి నేడు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ( సీడ‌బ్యూసీ ) స‌మావేశం కానుంది.

దీనికి ముందు.. ఈ రోజు ఉద‌యం 10:30 గంట‌ల‌కు కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం కానుంది. దీని తర్వాత జ‌రిగే సీడబ్యూసీ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చర్చిస్తారు. ఐదు రాష్ట్రాల్లో ఘోర ప‌రాజ‌యం పై ముఖ్యంగా చ‌ర్చించ‌నున్నారు. బీజేపీ క‌నీస పోటీ ఇవ్వ‌క పోవడం తో పాటు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులపై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌తు పై కూడా సీడబ్యూసీ స‌మావేశంలో చ‌ర్చిస్తారు.

కాగ ఈ స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా త‌మ ప‌దువుల‌కు రాజీనామా చేసే అవ‌కాశం ఉందని తెలుస్తుంది. గాంధీయేత‌ర కుటుంబ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎంచుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version