నాన్న నువ్వెప్పుడు బెస్ట్ : సితార

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా… యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన సితార ఎప్పటికప్పుడు సరికొత్త వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తన కుటుంబానికి సంబంధించిన పలు పోస్టులను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు సితార. తాజాగా ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… ఈ ఫోటో చూసి అభిమానులు అందరూ తెగ మురిసిపోతున్నారు.

ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన తీపి గుర్తులు అభిమానులతో షేర్ చేసుకున్నారు సితార. తండ్రి మెడలో చేతులు వేసి ఒడిలో నిద్రపోతున్న ఫోటోని ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారిపోయింది. విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్న సమయంలో తండ్రి ఒడిలో నిద్రపోతూన్న ఫోటోని షేర్ చేసి… సేద తీరేందుకు ఇంత కన్నా మంచి స్థలం ఉంటుందా.. నాన్న నువ్వే ఎప్పుడు బెస్ట్ అంటే కామెంట్ చేసింది. ఇది చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version