దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020 : టాలీవుడ్ లో ఎవరెవరికి దక్కాయంటే ?

-

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు 2018 నుండి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోని కొన్ని విభాగాలకు కూడా అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020 జాబితాను తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు తెలుగు సినిమా రంగంలో ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ ఎంపిక కాగా, మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ గా నాగార్జునకు గౌరవం దక్కింది.

ఇక  ఉత్తమ నటుడిగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి, ఉత్తమ నటిగా ‘డియర్ కామ్రేడ్’లో నటించిన రశ్మిక మందన్న ఎంపికయ్యారు. అలానే ఉత్తమ దర్శకుడిగా ‘సాహో’ చిత్రాన్ని రూపొందించిన సుజిత్ ను, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్. ఎస్. తమన్ లకు ఈ అవార్డ్ లభించింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version