తెలంగాణలో దళితులకు మరో శుభవార్త.. దళితబంధుతో పాటు ఉద్యోగం..

-

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళిథ బంధు. అయితే దళితబంధు పథకంతో ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురికి ట్రాక్టర్లు, వివిధ షాపులు పెట్టుకునేందుకు ఆర్థికంగా దళిత బంధు డబ్బులు వినియోగపడ్డాయి. అయితే ఇప్పడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో మురుగునీటి వ్యవస్థలో వినియోగించే మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాల పంపిణీతో అటు ఆర్థికంగా.. ఇటు ఉపాధిపరంగా దళిత కుటుంబాల్లో వెలుగు నింపేందుకు సమాయత్తమైంది అధికార యంత్రాంగం. ఈ మేరకు జలమండలి ఎండీ దానకిశోర్‌ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.

తమ పరిధిలో 50 యంత్రాల వినియోగానికి అవకాశముందని తెలియజేయడంతో దళితబంధు పథకం కింద ఆ మేరకు యంత్రాలను కొనుగోలు చేసి.. తద్వారా ఒక్కో వాహనంతో ముగ్గురి చొప్పున ఉపాధి కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. దీనికితోడు గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతున్నారు అధికారులు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు,జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ ఇప్పటికే జలమండలి ఎండీకి ప్రతిపాదనలు పంపినట్లు
తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version