సంజీవ‌య్య‌ను మ‌రిచార‌య్యా?

-

నిన్న‌టివేళ దామోద‌రం సంజీవ‌య్య జ‌యంతి . ఆయ‌న ఉమ్మ‌డి ఆంధ్రాకు రెండో ముఖ్య‌మంత్రి. మొద‌టి ద‌ళిత ముఖ్య‌మంత్రి. ఆయ‌న పేరునే క‌ర్నూలు జిల్లాకు పెట్టాల‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. జ‌న‌సేన కూడా ఆయ‌న పేరిట స్మార‌క నిర్మాణం ఏద‌యినా చేప‌ట్టాల‌ని ఎప్ప‌టి నుంచో ఆలోచిస్తోంది.

ఇందుకు ఓ కోటి రూపాయ‌లు కేటాయించింది కూడా..! దామోదరం సంజీవయ్య స్వగ్రామం కర్నూలు జిల్లా పెద్దపాడులో ఈ స్మార‌క నిర్మాణం చేప‌ట్టేందుకు జ‌న‌సేన నిర్ణ‌యించింది కూడా! ఈ స్థాయిలో మిగ‌తా పార్టీలేవీ ఆయ‌న‌ను స్మ‌రించుకున్న దాఖ‌లాలేవీ లేవు.

1960 లోనే రాష్ట్రానికి ఎంతో చేశారని, రాయలసీమలో గాజులదీన్నే, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో పులిచింతల, శ్రీకాకుళంలో వంశధార లాంటి నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి శ్రీ‌కారం దిద్దిన మ‌హ‌నీయుడు ఆయ‌న అని ఆ రోజు సంజీవ‌య్య గ్రామాన్ని సంద‌ర్శించిన వేళ మాజీ స్పీక‌ర్,జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్ర‌శంసించారు.

ఇంత‌వ‌ర‌కూ బాగుంది కానీ ఆయ‌న స్మ‌ర‌ణార్థం అధికార పార్టీ ఏం చేస్తుంద‌న్నది ఇప్ప‌టికీ తేల‌డం లేదు. నిన్న‌టి వేళ ఆయ‌న జ‌యంతి జిల్లా కేంద్రాల‌లో ఎక్క‌డా ఆ హడావుడే లేదు.అధికారిక కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన దాఖ‌లాలు అస్స‌లు లేవు.ఒక్క వైసీపీ అనేకాదు టీడీపీ కూడా నిన్నటి వేళ ఆయ‌న స్మ‌ర‌ణ‌నే మ‌రిచిపోయింది. ఎన్నిక‌ల వేళ మాత్రం హాయిగా ఆయ‌న పేరు వాడుకునే పార్టీల‌కు క‌నీస బాధ్య‌త లేక‌పోవ‌డ‌మే శోచ‌నీయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version