నెమలిని మించిన నాట్యం.. మా శివాని సొంతం

-

అందమైన నాట్యం చూస్తే మనసు ప్రశాంతంగా అవుతుంది. అదే చిన్నపిల్లలు ముద్దు ముద్దు గా అడుగులు వేస్తే ఇంకా ఎంతో ఆనందం గా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న జంతువుల పిల్లలు కూడా చాలా ముద్దుగా అనిపిస్తాయి. సాధారణంగా చాలామంది పెంపుడు జంతువులను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అవి చిన్నప్పుడు చూడడానికి ఎంతో ముద్దుగా కనిపిస్తాయి. అదే ఓ ఏనుగు పిల్ల ముద్దుముద్దుగా అడుగులు వేస్తూ ఆడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. మీ ఊహల లో ఉన్న ఏనుగు పిల్లను మీ ముందుకు ఇప్పుడు మేము తీసుకొని వస్తాము.. అంటూ మంజునాథ స్వామి ఆల‌య నిర్వాహకులు దానిని స్టేజీ మీదకు తీసుకొని వచ్చారు.

ఉత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారిని ఊరేగించ‌డం కోసం ఈ ఏనుగుల‌ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే జూలై 1న‌ ఓ ఏనుగు పిల్ల‌ పుట్టింది. ఇప్పుడు ఆ ఏనుగు పిల్ల‌కు రెండు నెల‌లు నిండి మూడో నెల‌లో అడుగుపెట్టింది. అంతేకాదు ఆలయ నిర్వాహకులు ఈ ఏనుగు పిల్లకు మంచి పేరును కూడా సూచించారు. ఈ సందర్భంగా దానికి శివానీ అని పేరు పెట్టారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే కల్మషం లేని నా జంతువులు ఆడుకుంటూ ఉంటే మనసులో ఎన్ని బాధలో ఉన్న వెంటనే పోతాయి.అదేవిధంగా గుడికి వచ్చిన భక్తులు శివాని ని చూసి మంత్రముగ్ధులు అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version