మీ డెబిట్ కార్డు పోయింది, బ్యాంకుకి వెళ్ళండి…!

-

మీ బ్యాంకు ఖాతా నుంచి మీకు తెలియకుండా డబ్బులు తీసినట్టు మెసేజ్ వచ్చిందా…? అయితే వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత బ్యాంకు కి వెళ్లి విషయం చెప్పండి. ఎందుకు అంటారా దాదాపు 50 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు చోరీ అయ్యాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసే ఓ వెబ్‌సైట్… సంవత్సరం నుంచీ భారతీయుల సీక్రెడ్ డేటా సేకరించి డేటా అమ్మకానికి పెట్టింది.

వాటిని హ్యాకర్లకు అమ్మింది సదరు సంస్థ. దాదాపు ఒక్కో డెబిట్ కార్డు రేటూ రూ.5వేలు, ఒక్కో క్రెడిట్ కార్డు రేటూ రూ.10వేలు అని ఇంటర్నెట్ లో పెట్టి విక్రయించగా ఒక సంస్థ మొత్తం కొనుగోలు చేసింది. ఇక డేటా క్లోనింగ్ చేసి దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు నకిలీ కార్డులు సృష్టించి అందులో ఉన్న నగదు మొత్తం లాగేస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ఎక్స్‌పైరీ డేట్స్, 14-16 డిజిట్ కార్డ్ నంబర్స్, కార్డుదారుల నేమ్స్, CVV/CVC కోడ్లు, చివరకు ఈమెయిల్ అడ్రెస్‌లు అమ్మేసారు.

ఇండియాలో డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా చోరీల్లో ఇది రెండో అతి పెద్దది అంటున్నారు. మొత్తం 4,61,976 కార్డుల్ని ఒక్కోటీ 9 డాలర్లకు అమ్మి, రూ.30 కోట్లు ఆ వెబ్‌సైట్ సంపాదించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సమాచారం నేపధ్యంలో అన్ని బ్యాంకుల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భారీగా నగదు ఉన్న ఖాతాదారులు ఇప్పుడు భయపడిపోతున్నారు. బ్యాంకు లు ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈ విధంగా జరగడం బ్యాంకు ల భద్రతను ప్రశ్నార్ధకం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version