కొండా సురేఖపై పరువు నష్టం దావా.. నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై చేసిన వ్యాఖ్యలకు గాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం నాంపల్లి న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ రికార్డ్ చేయనున్నారు.

గత విచారణలో స్టేట్‌మెంట్ రికార్డు కోసం కేటీఆర్ కొంత సమయం కోరడంతో న్యాయమూర్తి ఈ కేసును నేటికి వాయిదా వేశారు.దీంతో నేడు కేటీఆర్ కోర్టుకు హాజరై తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇక నాగార్జున సైతం మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేయగా.. కొండా సురేఖ కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నది. ఆ పిటిషన్‌పై కూడా కొండా సురేఖకు కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో నాగార్జునతో పాటు ఆయన భార్య అమల తదితరులు తమ తమ స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టుకు సమర్పించారు. కాగా,మంత్రి ఇప్పటికే తన వ్యాఖ్యల పట్ల నాగార్జున కుటుంబానికి, సమంతకు క్షమాపణలు చెప్పారు. కేటీఆర్ విషయంలో మాత్రం చెప్పలేదు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై కోర్టు ఎటువంటి తీర్పు చెబుతుందో వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version