దిల్లీ లిక్కర్ స్కామ్.. నిందితుల రిమాండ్‌ పొడిగింపు

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టయిన నిందితులకు మరోసారి రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను పొడిగించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున, నిందితులకు రిమాండ్‌ వ్యవధిని పెంచాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. నిందితులుగా ఉన్న శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి జ్యుడీషియల్‌ రిమాండ్‌ డిసెంబరు 30తో ముగిసినందున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారిని ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.

ఈడీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ నెల 7వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మద్యం కేసుపై దర్యాప్తు చేపడుతున్న ఈడీ.. ఈనెల 5న మరో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది. సౌత్‌ గ్రూప్‌ లావాదేవీలపై సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని పేర్కొంది. ఈ కేసులో నవంబరు 10న శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబులను అరెస్టు చేసిన ఈడీ.. అంతకు ముందు సెప్టెంబరు 27న విజయ్‌నాయర్‌, అక్టోబర్‌ 10న అభిషేక్‌ బోయిన్‌పల్లిని అరెస్టు చేసింది. సౌత్‌గ్రూప్‌ లావాదేవీల్లో ఈ నలుగురూ కీలకంగా వ్యవహరించారని ఈడీ తేల్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version