ఢిల్లీ ఆక్రమణల కూల్చివేతలపై సుప్రీం ‘స్టేటస్ కో’… ఓ వర్గాన్ని వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న విపక్షాలు

-

ఈ నెల 16న హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రపై ఢిల్లీలోని జహంగీర్ పురిలో ఓవర్గం వారు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఘటనకు కారణం అయిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జహంగీర్ పురిలోని ఆక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. 400 మంది పోలీసుల భారీ భద్రత మధ్య 20 బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ అంశంపై సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు అయింది. అయితే ఈ కూల్చివేతలపై సుప్రీం కోర్ట్ ‘ స్టేటస్ కో’ ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ సుప్రీం కోర్ట్ ఆదేశాలను పాటిస్తామని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ అన్నారు. అయితే తమకు ఇంకా నోటీసులు అందలేదని ఆయన తెలిపారు. అయితే సుప్రీం కోర్ట్ ‘ స్టేటస్ కో’ ఇచ్చినా.. నోటీసులు అందకపోవడంతో కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. 

ఇదిలా ఉంటే కొంతమంది విపక్షాల నాయకులు ఈ కూల్చివేతలను తప్పుపడుతున్నారు. ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్ బోర్డ్  ఛైర్మన్​ అమానాతుల్లా ఖాన్ ఆరోపించారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించేందుకు రంజాన్​ లాంటి పవిత్ర మాసంలో ఇలా చేయడం దారుణమన్నారు. సీపీఐ లీడర్ బ్రుందాకారత్ జహంగీర్ పురి ఏరియాకు చేరుకుని కూల్చివేతలను వ్యతిరేఖంగా స్థానికులకు మద్దతు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version