దేవీశ్రీ ప్రసాద్ పాటల్లో, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో..!!

-

ఈ సంక్రాంతి కి  బాలయ్య బాబు నటించిన వీర సింహ రెడ్డి మరియు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల సింహలు లాగా తలపడ్డాయి.మొదటి నుండి ఈ రెండు సినిమాలు చాలా పోటీ వాతావరణం లో పోటీ పడుతున్నాయి. ఇక వసూళ్ల లో బాలయ్య బాబు మీద మెగాస్టార్ చిరంజీవి దే పైచేయి సాధించింది. బాలయ్య బాబు సినిమా లో హింస ఎక్కువ ఉండి ఎంటర్టైన్మెంట్ తగ్గడం తో ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.

ఇక సంగీతం విషయం లోకి వస్తే  చిరు మూవీ కు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా, బాలయ్య బాబు మూవీ కు తమన్ సంగీతం అందించారు. ఇక గతంలో వీళ్ల  పాటల విషయంలో కూడా పోటీ నడిచింది. ఈ పాటలలో ఎవరికి ఎక్కువ ఆకట్టుకున్నాయి, ఎన్ని లైక్ లు వచ్చాయి, వ్యూస్ వచ్చాయి అనే వాటిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు జరిగాయి.

ఇక సినిమాల విడుదల తర్వాత తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మాత్రం పాటల విషయంలో పేరు వచ్చింది. బయట ఎక్కడ విన్నా దేవీశ్రీ ప్రసాద్ పాటలు మాత్రమే ఎక్కువగా వినపడుతున్నాయి.వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ పాట ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని ఇంకా కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత పూనకాలు లోడింగ్ ఏకంగా 20 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version