ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందక, ఇక్కడి ప్రజల గుండెలు మండిపోతున్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. అసమానత కారణంగా ఉత్తరాంధ్ర లో ఉన్న సంస్దలు అన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలవారివేనని పేర్కొన్నారు. ఒక ప్రాంతం నెగ్లెట్ కావడం వలన , మా ప్రాంతం బీదవారిగా మారిందని వెల్లడించారు. మా ప్రాంతపు వాసుల ఆవేదనతో గుండెలు మండుతాయి… పాలకులు అసమానతలు సరిదిద్దాలని కోరారు.
అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని కోరారు. మా గొంతు విన్నప్పుడైనా గుర్తించాలి. మా ఆవేదన గుర్తించాలి.సెక్షన్ 6 ప్రకారం వేసిన రాజ్యంగ వద్ద సంస్ద ఇచ్చిన నివేదిన వదిలేసారని గుర్తు చేశారు. కమిటి నివేదిన వదిలేసి చంద్రబాబు సొంత పార్టీ నేతలతో కమిటీ ఎందుకు వేసారో సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విరుద్దంగా కమిటి వేయవచ్చా.. చంద్రబాబు సమాదానం చెప్పాలి… సెంటర్ పాయింట్ సమష్యకాదు. ఏ రాష్ర్టం రాజధాని సెంటర్ లో ఉందో సమాదానం చెప్పాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.