డ‌యాల‌సిస్ రోగుల‌కు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో పెర‌గ‌నున్న డ‌యాల‌సిస్ కేంద్రాలు

-

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డ‌యాల‌సిస్ రోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ‌యాల‌సిస్ కేంద్రాలను పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న కిడ్నీ బాధితుల అవ‌స‌రాల కోసం డ‌యాల‌సిస్ యంత్రాల‌ను, డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను పెంచుతున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 515 డ‌యాల‌సిస్ యంత్రాల‌ను, 61 డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను కొత్త‌గా ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌భుత్వం ఎంపిక చేసిన ఆయా కేంద్రాల్లో విడ‌త‌ల వారీగా డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను, యంత్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కాగ తొలి ద‌శ‌లో రాష్ట్రంలో ఏడు ఆస్ప‌త్రుల్లో డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

భువ‌న‌గిరి, బెల్లంప‌ల్లి, బాన్సువాడ ఏరియా ఆస్ప‌త్ర‌లు, కొడంగ‌ల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి, ఎల్లారెడ్డి, కొల్లాపూర్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్స్ తో పాటు నారాయ‌ణ పేట జిల్లా ఆస్ప‌త్రిలో మొద‌టి విడత నూత‌నంగా డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version