అక్కినేని హీరో ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టేనా..?

-

హీరో నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం థాంక్యూ. ఈ సినిమాని జూలై 7వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నాగ చైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ వంటి ప్రేమ కథ చిత్రం తో పాటు బంగార్రాజు వంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయాలను అందుకున్న ఈయన ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టడం కోసం సిద్ధమవుతున్నారు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న సరికొత్త చిత్రం థాంక్యూ. ఇక ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లను విడుదల చేశారు. కానీ నిర్మాత నుంచి ఎప్పుడు కూడా అప్డేట్ రాలేదు. ఇక నిర్మాత దిల్ రాజు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు అని ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే జూలై 7వ తేదీన థాంక్యూ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్స్ చేసుకోవడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది కాబట్టి ఆ లోపు సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాతో కచ్చితంగా నాగచైతన్య హ్యాట్రిక్ హిట్ కొడతాడు అని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో నాగచైతన్య మూడు డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ ఉండగా రాశిఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక అవికాగోర్ , మాళవికా నాయర్ లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక నాగచైతన్య ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇక అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా నాగచైతన్య కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొడతాడో లేదో తెలియాలంటే జూలై 7 వరకూ ఎదురుచూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version