స్టేట్ బ్యాంక్ నుండి మీకూ మెసేజ్ వచ్చిందా..? జాగ్రత్త సుమా..!

-

నకిలీ వార్తలు తరచు మనకి కనబడుతూనే ఉంటాయి. నిజానికి ఒక్కొక్కసారి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి ఈ వార్త నిజమా కాదా అసలు ఇందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం.

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఈ సేవలు వలన చాలామంది కస్టమర్స్ కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఫేక్ మెసేజెస్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఎక్కువ వస్తున్నాయి. అకౌంట్ బ్లాక్ అవుతుందని.. అకౌంట్ పని చేయడం లేదని.. అకౌంట్ ఆక్టివ్ గా ఉండాలంటే వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఒక మెసేజ్ తరచూ కస్టమర్లకి వస్తోంది.

అలానే పాన్ కార్డు అప్డేట్ చేయాలని కూడా మెసేజ్ ఎక్కువగా వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి మెసేజ్లు నకిలీవి అని ఎన్నిసార్లు చెప్పినా సరే చాలామంది మోసపోతున్నారు. తాజాగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ దీనిపై స్పందించింది. స్టేట్ బ్యాంక్ పేరుతో ఫేక్ మెసేజ్ లు వస్తున్నాయని… పాన్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే యోనో అకౌంట్ బ్లాక్ చేస్తామని నేరగాళ్లు భయపెడుతున్నారు అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇలాంటి ఎస్ఎంఎస్ లు కి ఈమెయిల్స్ కి స్పందించకండి అని అంది.

చాలా మంది మోసగాళ్లు పాన్ కార్డు వివరాలను తెలుసుకోవాలని ఇలా చేస్తున్నారు. ఇటువంటి మెసేజ్లకి రెస్పాండ్ అవ్వకండి అలానే మెసేజ్ పంపి ఒక లింక్ కూడా ఇస్తున్నారు ఇటువంటి లింక్స్ మీద క్లిక్ చేస్తే మీరే నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేదంటే అకౌంట్ కాళీ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version