అన్నీ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్…నోట్ల కు కొంచం దూరంగా ఉంటేనే మంచిదట

-

ప్రపంచదేశాలలో కరోనా తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా వ్యాపించడం తో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా మృతి చెందగా, కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షల 50 వేల కు పైగా నమోదు అయ్యాయి. ప్రపంచ దేశాలను వణికించేస్తున్న ఈ కరోనా వల్ల ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా చెయ్యొద్దు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కరోనా వైరస్ కొద్దీ గంటలవరకు నోట్ల పై,కార్డుల పై కూడా బతికే ఉంటుంది అని ఈ క్రమంలోనే ఇక మీదట కుదిరినంత వరకు డిజిటల్ గా పేమెంట్లు చేయడమే ఉత్తమం అంటూ నిపుణులు చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోట్లు కంటే కూడా ఈ కాంటెక్ట్ లెస్ పేమెంట్‌లే మంచిదని తెలిపింది. దీనితో ఇప్పుడు నగదు లావాదేవీల కంటే కూడా డిజిటల్ లావాదేవీ ల వల్ల కరోనా వ్యాపించే అవకాశాలు తగ్గుతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం డిజిటల్ పరికరాలకి ఎలానో కొరత లేదు కాబట్టి గూగుల్ పే ఫోన్ పే లాంటి వాటిల్లో ఖర్చు చెయ్యడం ఉత్తమమని వరల్డ్ హెల్త్ ఆర్గనిజేషన్ కూడా అభిప్రాయపడుతోంది. నేరుగా బ్యాంకు నుండి ట్రాన్సాక్షన్స్ చెయ్యడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి కరోనా సోకకుండా వుండాలంటే కరెన్సీని కూడా అతిగా వాడటం మానేయాలని నిపుణులు అంటున్నారు.

కరెన్సీ నోట్లతో కూడా కరోనాతో ప్రమాదమే కాబట్టి ఆన్ లైన్ పేమెంట్లే బెస్ట్ అంటున్నారు వైద్యులు. ఇప్పటికే ఈ కరోనా సోకి చైనా,ఇటలీ,ఇరాన్,ఫ్రాన్స్ లలో ఎక్కువ మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చైనా లో 3 వేల మందికి పైగా మృతి చెందగా,చైనా ను దాటి ఇటలీలో భారీ గా మృతుల సంఖ్య నమోదైనట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version