పండ్లు తిన్నాక మంచినీళ్లు ఎందుకు తాగకూడదో తెలుసా…?

చాలా మంది పండ్లు తిన్న తర్వాత మంచి నీళ్లు తాగుతూ ఉంటారు. పండ్లలో స్వీట్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ మరియు ఈస్ట్ సమృద్ధిగా పండ్లలో ఉంటాయి. అవి సరిగ్గా జీర్ణం అవ్వాలి. మనం ఏ ఆహారం తీసుకున్నా అది కడుపు వరకు రీచ్ అవుతుంది. ఆ తర్వాత కడుపులో నుంచి యాసిడ్ రిలీజ్ అవుతుంది. దీని కారణంగా ఆహార పదార్థాలు విరిగి అవి జీర్ణం అవుతాయి. అయితే మీరు పండ్లు తిని వెంటనే నీళ్లు తాగితే మంచినీళ్లు యాసిడ్ యొక్క సామర్థ్యాన్ని బలహీనం చేస్తాయి. దీని కారణంగా జీవితం సరిగ్గా అవ్వదు.

తద్వారా క్రామ్ప్స్ తో పాటుగా గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి. పుచ్చకాయ, కీరా దోస వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకున్న వెంటనే మంచి నీళ్లు తాగడం వల్ల లూజ్ మోషన్స్ లేదా డయేరియా కి దారి తీస్తాయి. అదే విధంగా పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పీహెచ్ లెవెల్స్ ని తికమక చేసి సమస్యలు తీసుకొస్తాయి.

అలానే పండ్లు తిన్నాక నీళ్లు తాగడం వల్ల జీర్ణప్రక్రియ స్లో అయిపోతుంది. దీని కారణంగా చాలా వరకు ఆహారం జీర్ణం కాకుండా ఉంటుంది. మిగిలిపోయిన ఆహారం కొవ్వు కింద మారిపోయి ఇన్సులిన్ ని పెంచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి దీని కారణంగా డయాబెటిస్ కి దారితీస్తుంది.

పండ్లు తిన్న వెంటనే మంచి నీళ్లు తాగడం వల్ల దగ్గు కూడా వస్తుంది. ఫ్రూట్స్ తీసుకున్న వెంటనే నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. ఉదాహరణకు నిమ్మకాయని నీళ్ళలో పిండి తీసుకోవడం వల్ల సమస్య రాదు. అదే ఒకవేళ మీరు నిమ్మని తిని తర్వాత నీళ్లు తాగడం వల్ల ఇబ్బంది పడొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా నీళ్లు ఎక్కువగా ఉన్న పండ్లు లేదా తియ్యదనం ఎక్కువ పండ్లను తీసుకుంటే కాసేపు ఆగి నీళ్లు తాగండి. వెంటనే తాగొద్దు. దీని వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది.