ఇలా చేస్తే కరోనా రాదు… వీటిని అసలు టచ్ చేయవద్దు…!

-

కరోనా వైరస్ రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని కొన్ని కచ్చితంగా చెయ్యాల్సి ఉంటుంది. కరోనా వైరస్ ని మనం అడ్డుకోవాలి అంటే దాన్ని కట్టడి చెయ్యాలి. అంటే అది రాకుండా ఉండటానికి మన వంతుగా సామాజిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటివి ఎక్కువగా చెయ్యాలి. ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లలో కరోనా వైరస్ మూడు గంటలు బతికి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.

ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్, బెంచీలపై, గ్లాసులపై కరోనా వైరస్ మూడు గంటల పాటు బ్రతికి ఉంటుంది. ఇక కార్డ్ బోర్డ్, పేపర్, ఫాబ్రిక్, హెస్సియన్ వంటి వాటిపై అది 24 గంటలు బతికి ఉంటుందని వైద్యులు గుర్తించారు. కరోనా వాటిపై ఉంటే ఏమీ కాదు గాని మన కంట్లోకి, ముక్కులోకి వెళ్తే ఇబ్బంది. మన చేతులను రెండు గంటలకు ఒకసారి కడుక్కోవాలి. మన ఒంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి.

హ్యాండ్ శానిటైజర్ రాసుకోవాలి. సబ్బుతో బాగా కడుక్కున్నప్పుడు 99 శాతం వైరస్ వదిలిపోతుంది. ఆ తర్వాత హ్యాండ్ శానిటైజర్ రాసుకోగానే… ఆ వాసన, అందులోని ఆల్కహాల్ కంటెంట్ వల్ల ఆ వైరస్ చనిపోతుంది. కాబట్టి మనం ఆ వైరస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ముక్కులోకి వెళ్ళకుండా, కళ్ళల్లోకి, నోట్లోకి వెళ్ళకుండా ఉంటె మనని మనం కాపాడుకున్నట్టే.

Read more RELATED
Recommended to you

Latest news