జూన్ లో పక్కాగా ఈ 6 పనులు పూర్తి చేసుకోండి.. లేదంటే గడువు ముగిసిపోతుంది..!

-

గడువు ముగిసిపోయే లోగా పనులని పూర్తి చేసుకోకపోతే నష్టాలని ఎదుర్కోవాల్సి వుంది. వ్యక్తిగత ఆర్థిక అంశాలకు సంబంధించిన కీలకమైన పనులకు సంబంధించిన గడువు జూన్ నెలలోనే క్లోజ్ అయిపోనుంది. సో ప్రతీ ఒక్కరు కూడా డెడ్ లైన్ ముగిసిపోయే లోగా పనులని పూర్తి చేసుకోవాలి. లేకపోతే చిక్కుల్లో పడాల్సి వుంది. జూన్, 2023లో గడువు ముగిసే ఆరు డెడ్‌లైన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పనులని పూర్తి చేసుకోకపోతే సమస్యలని ఎదుర్కోవాల్సి వుంది.

పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్:

పాన్-ఆధార్ లింక్ తప్పక చెయ్యాలి. జూన్ 30, 2023 వరకు గడువు ఇచ్చారు. పాన్-ఆధార్ లింక్ చేయక పోయినట్టు అయితే ఈ గడువులోపు లింక్ చెయ్యాలి. ఇప్పుడైతే రూ.1000 పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ ద్వారా జరిమానా చెల్లించిన తర్వాత టైం తీసుకుని ప్రయత్నించాలి. జూన్ 30 తర్వాత లింక్ చేయక పోతే వారి పాన్ కార్డు పని చెయ్యడని సీబీడీటీ స్పష్టం చేసింది.

ఆధార్ అప్డేట్:

ఆధార్ ని ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అప్డేట్ చెయ్యచ్చు. ఈ అవకాశంని యూనిక్ ఐడెంటిపికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడీఏఐ ఇచ్చింది. ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటి ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారు తప్పకుండా వారి ఆధార్ ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఉచిత సర్వీసు జూన్ 14, 2023 వరకే ఉంటుంది.

అధిక పెన్షన్ దరఖాస్తు గడవు:

అధిక జీతంపై అధిక పెన్షన్ పొందేందుకు రెండోసారి డేట్ ని ఎక్స్టెండ్ చేసారు. సుప్రీం కోర్టు తీర్పుతో మార్చి 3, 2023 వరకు గడువు లభించింది. మళ్ళీ గడువును జూన్ 26, 2023 వరకు పొడింగిచారు.

ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ:

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇండ్ సూపర్ 400 డేస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కి టైం జూన్ 30, 2023 వరకు ఉంటుంది.

బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్:

లాకర్ అగ్రిమెంట్లను డిసెంబర్ 31, 2023 నాటికి దశల వారీగా పూర్తి చేసుకోవాలని బ్యాంకులకు గడువు ఉంచింది. జూన్, 30, 2023 నాటికి 50 శాతం పూర్తి చేయాలి.

ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్:

అమృత్ కలశ్ రిటైల్ టర్మ్ డిపాజిట్ 400 డేస్ టెన్యూర్ స్కీమ్ ని స్టేట్ బ్యాంక్ మళ్ళీ తెచ్చింది.
జూన్ 30, 2023 వరకే ఈ స్కీము అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version