ఈరోజుల్లో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం అయిపోయింది. ప్రతి చిన్న పనికి ఆధార్ కావాల్సిందే. ఆధార్ కార్డు ముఖ్యంగా అడుగుతారు. మీరు ఈ దేశ పౌరుడని తెలిపే కార్డు ఆధార్ కార్డు. ఇందులో చిన్న తప్పు ఉన్నా.. పెద్ద తలనొప్పి. అందుకే అందులో వివరాలు ఎప్పుడూ క్లియర్‌గా ఉండాలి. పుట్టిన తేదీ, పేరు, చిరునామా ఇలాంటి వివరాలను అప్‌డేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇవి అప్‌డేట్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుందని మీకు తెలుసా..?
మీ ఆధార్ కార్డ్‌లో, మీరు మీ జెండర్‌ను, పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే సవరించగలరు. అలాగే, మీరు మీ పేరును 2 సార్లు మాత్రమే మార్చగలరు.అలాగే, మీ నివాస చిరునామాను మార్చుకోవడానికి మీ ఆధార్ కార్డ్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే, దీని కోసం మీరు పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ లేదా ఇతర చిరునామా రుజువు వంటి గుర్తింపు రుజువును సమర్పించాలి. ఈ సమాచారం అంతా ఆన్‌లైన్‌లో కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.
అలాగే మీరు మూడోసారి ఆధార్ కార్డులో మీ పేరును మార్చుకోవాలనుకుంటే, మీరు సమీపంలోని ఆధార్ కార్డ్ సెంటర్‌ను సందర్శించాలి. UIDAI ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి మీ పేరును అప్‌డేట్ చేయడానికి అనుమతి పొందండి.
ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైనది మరియు మీ ఆధార్ కార్డ్ సమాచారాన్ని తెలియని వ్యక్తికి ఎప్పుడూ ఇవ్వకండి. అలాగే, మీరు దానిని జాగ్రత్తగా ఉపయోగించాలి. ప్రస్తుతం ఆధార్ కార్డులు ద్వారా అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలను నివారించడానికి మీరు మీ ఆధార్ వివరాలను ఎవరికీ ఇవ్వకూడదు. ఇది కాకుండా, మీ ఫోన్‌లో మీకు లభించే ఆధార్ OTPని తెలియని వ్యక్తికి ఎప్పుడూ ఇవ్వకండి. ఇలా చేస్తే మోసపోయే అవకాశం ఉంది.
మీ ఆధార్ వివరాలను, బయోమెట్రిక్ వివరాలు ఎప్పటికప్పుడు లాక్ చేసుకోండి. అవసరం ఉన్నప్పుడు అన్‌లాక్ చేసుకోవచ్చు. UIDAI వెబ్‌సైట్‌లో ఆధార్ వివరాలను లాక్ చేసుకోవచ్చు. దీనికి ఐదు నిమిషాల సమయం కూడా పట్టదు.