రెమ్యునరేషన్ పెంచేసిన నేచురల్ స్టార్.. ‘స్ప్రైట్’ యాడ్‌కు నాని తీసుకున్నది అన్ని కోట్ల?

-

సహజ నటనకు కేరాఫ్ గా నిలిచి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న యంగ్ హీరో నాని. నేచురల్ స్టార్ గా తెలుగు సినిమాలో తనదైన ట్రెండ్ క్రియేట్ చేసి ముందుకు సాగుతున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘దసరా’ చేస్తున్నాడు నాని.

నాని గత చిత్రం ‘అంటే సుందరానికీ’ ప్రజలను ఆకట్టుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నాని.. ఆ తర్వాత కాలంలో హీరోగా మారి ప్రేక్షకుల ఫేవరెట్ హీరో అయిపోయాడు. బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఫీలింగ్ ను ఈజీగా క్రియేట్ చేసిన నాని.. సినీ ఇండస్ట్రీకి రాక మునుపు ఆర్జేగానూ పని చేశారు.

ఇక అందరు సెలబ్రిటీల మాదిరగా నాని కూడా పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. తాజాగా ‘స్ప్రైట్’ యాడ్ లో నాని కనిపించాడు. ఈ యాడ్ చేసినందుకు నాని తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నాని వంటి అప్ కమింగ్ ప్లస్ జనాలకు ఈజీగా కనెక్ట్ అయ్యే స్టార్ తో యాడ్ చేయాలని ఆ కంపెనీ వారు భావించారట. అందుకే నానితో యాడ్ చేశారు.

ఈ యాడ్ కు నాని కి కంపెనీ వారు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘దసరా’ సినిమాలో ఉన్న లుక్ తోనే నేచురల్ స్టార్ నాని.. ‘స్ప్రైట్ ’ యాడ్ లో కనిపించారు. ఇక నాని రేంజ్ ఈ సినిమాతో డెఫినెట్ గా పెరుగుతుందని సినీ పరిశీలకులు అంటున్నారు. ‘దసరా’ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version