విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగా ఇష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేమ్ టైమ్ లో సెంటిమెంట్, కామెడీ పంచగల నటుడిగా వెంకటేశ్ కు చక్కటి పేరు ఉంది. ఆయన నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ పిక్చర్ ఘన విజయం సాధించింది. ఇందులో వెంకీకి జోడీగా సౌందర్యతో పాటు వినీత నటించింది.
చిత్రంలో చక్కటి మాటలతో నాగ అన్వేష్ ‘తలలో మల్లెపూలు పెట్టాలి’ అనే డైలాగ్ చెప్తూ వెంకటేశ్ ను ఇరిటేట్ చేస్తుంటాడు. అలా నాగ అన్వేష్ అందరికి నచ్చేశాడు. ప్రజెంట్ ఆ బుడ్డోడు పెద్దోడు అయిపోయి టాలీవుడ్ యంగ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘వినవయ్యా రామయ్యా’, ‘ఏంజెల్’ చిత్రాలు చేశాడు.