కరోనా వ్యాక్సిన్ ని ఎవరెవరు తీసుకోకూడదో తెలుసుకోండి..

-

తొమ్మిది నెలల పాటుగా మనల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేసిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ప్రపంచాన్నే గడగడలాడించిన అతిచిన్న కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ అను వ్యాక్సిన్లకి భారత ప్రభుత్వం నుండి అనుమతి లభించింది. ఈ రెండు వ్యాక్సిన్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలయ్యింది.

ఐతే ఈ వ్యాక్సిన్ల పట్ల చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. వ్యాక్సిన్ ఎవరెవరి తీసుకోవాలి. ఎవరెవరు తీసుకోకూడదు అనే విషయాలు అందరికీ తెలియవు. ముందుగా ఈ వ్యాక్సిన్లని ఎవరెవరు తీసుకోకుడదో తెలుసుకుందాం.

జ్వరం, అలర్జీ, గాయాల నుండి రక్తం కారడం వంటి సమస్యలు ఉన్నవారు కరోనా కోవ్యాక్సిన్ ని తీసుకోకూడదు. అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నావారు, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే మందులు వాడుతున్నవారు కూడా కోవ్యాక్సిన్ ని తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు, ఇతర కరోనా వ్యాక్సిన్ ని తీసుకున్నవారు భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ ని తీసుకోరాదు.

సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ ని ఎవరు తీసుకోకూడదంటే,

అలర్జీ, జ్వరం, గాయాలు తగిలినపుడు, గర్భం దాల్చినపుడు, బిడ్డకు పాలిచ్చే తల్లులు, గర్భం కోసం ప్రయత్నం చేసేవారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని తీసుకోకూడదు.

వ్యాక్సిన్ రెండు డోసుల ప్రక్రియలో ఒక డోస్ ఒక వ్యాక్సిన్, మరో డోస్ మరో వ్యాక్సిన్ ది తీసుకోకూడదు. పై విషయాలు పరిగణలోకి తీసుకున్ని మీరు వ్యాక్సిన్ ని తీసుకోండి. పై ఇబ్బందులు ఉన్నట్లయితే వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version