గచ్చిబౌలిలో జరిగిన ఓ ఘటన సిటీలోని ఎందరో భవన యజమానులు షాక్ అయ్యేలా చేస్తోంది. తమ సెల్లార్‌లోకి చేరిన నీటిని మోటార్‌తో సర్వీస్ రోడ్డుపైకి వదిలినందుకు వాసవీ జీపీ ట్రెండ్స్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్‌కు రూ. లక్ష జరిమానా విధించారు. ఇలా రోడ్డుపైకి నీళ్లు వదలడం ఇది తొలిసారి కాదు… చాలాసార్లు ఈ మేనేజ్‌మెంట్… రోడ్డుపైకి నీటిని వదులుతోంది. అసలే అది సర్వీస్ రోడ్డు, నీరు రాగానే బురదలా మారుతోంది. వర్షాకాలం కావడంతో వామనదారులకు, పాదాచారులకు ఇబ్బందిగా మారింది.
దీంతో వాహనదారులు తమ బైకులకు బ్రేక్ వేస్తే చాలు జర్రున జారుతున్నారు. కింద పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు వచ్చి మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించారు. అయినా మేనేజ్‌మెంట్ పద్ధతి మార్చుకోకుండా నీటిని రోడ్డు మీదకు వదులుతోంది. ఈ విషయాన్ని మంగళవారం జోనల్ కమిషనర్ రవికిరణ్ దృష్టికి తీసుకువెళ్లి, జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ రవి పేర్కొన్నారు.