స‌త్య‌దేవ్ కు నాకు కుద‌ర‌దు అంటున్న న‌య‌న‌తారా?

-

యంగ్ హీరో స‌త్య‌దేవ్ పై లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తుంది. న‌య‌నతారా హీరో స‌త్య దేవ్ ఇద్ద‌రూ కూడా మెగా స్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర లో వ‌స్తున్న గాడ్ ఫాధ‌ర్ సినిమా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా కు సంబంధించి కాస్త గంద‌ర గోళం జ‌రుగుత‌న్న‌ట్టు తెలుస్తుంది. అది కూడా పాత్ర ల‌కు న‌టీ న‌టులు స‌రిపోవడం లేద‌నే వార్త బ‌య‌ట‌కు వినిపిస్తుంది. ముఖ్యం గా ఈ సినిమా లో సీఎం పాత్ర‌కు కొడుకు, కూతురు తో పాటు అల్లుడు పాత్ర‌లు ఉంటున్నాయి. అయితే కూతురు పాత్ర లో న‌య‌న‌తార ను చిత్ర యూనిట్ ఇప్ప‌టి కే ప్ర‌క‌టించింది.

అలాగే సీఎం అల్లుడి పాత్ర లో కూడా యంగ్ హీరో స‌త్య‌దేవ్ పేరు ను చిత్ర బృందం ఫైన‌ల్ చేసింది. అయితే స‌మ‌స్య అంతా ఇక్క‌డే వ‌చ్చిన‌ట్టు ఉంది. న‌య‌న తార భ‌ర్త పాత్ర లో స‌త్య‌దేవ్ న‌టిస్తున్నాడు. దీంతో స‌త్య దేవ్ త‌న‌కు భ‌ర్త గా కుద‌ర‌డం లేద‌ని న‌య‌న తార అంటుంద‌ని స‌మాచారం. స‌త్య‌దేవ్ త‌న భ‌ర్త అంటే న‌య‌న తార తీవ్రం గా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఆ పాత్ర‌లో స‌త్య దేవ్ కాకుండా మ‌రి ఒక్క‌రిని చూడాల‌ని చిత్ర యూనిట్ ను న‌య‌న‌తార కొరిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ వార్త పై న‌య‌న తార గానీ సత్య‌దేవ్ గాని చిత్ర బృందం కాని ఇంత వ‌ర‌కు స్పందించ లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version