రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్‌కు ఉందంటారా?: వైఎస్ షర్మిల

-

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ ఇప్పటికీ నెరవేర్చలేదని వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రావినూతల, ముష్టికుంట్ల, బోనకల్ గ్రామాల్లో ఆమె ప్రజా ప్రస్థానం పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్ పాలనపై పలు విమర్శలు చేశారు.

వైఎస్ షర్మిల

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలో దళితులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబమే బాగు పడిందన్నారు. రుణమాఫీ చేయకుండా.. రైతుబంధు పేరుతో రైతులను మోసం చేస్తున్నాడని, రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version