జ్ఞాన దంతాల వల్ల మనిషి మేధస్సు, ఆలోచనా సామర్థ్యం పెరగదా..?

-

ప్రతి మనిషికి జ్ఞాన దంతాలు వస్తాయి అప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు అలా జ్ఞానదంతాలు వస్తున్నాయంటే..ఇంట్లో పెద్దవాళ్లు ఇక నీకు బుద్దీ, జ్ఞానం రెండూ పెరుగుతాయి అంటారు. పేరుకు తగ్గట్టుగానే జ్ఞానదంతాల వల్ల మనిషి మేధస్సు, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందా? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. అందుకే శాస్త్రేవత్తలు పరిశోధనలు చేశారు. వారి పరిశోధనలో ఏం తేలిదంంటే..

WebMD నివేదిక ప్రకారం.. ఒక వయోజన వ్యక్తికి మొత్తం 32 దంతాలు ఉంటాయి. వీటిలో 4 దంతాలు పైన రెండు, కింద రెండు ఉంటాయి. 17 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సులో వచ్చినప్పుడు అవి మానవ మేధస్సుతో సంబంధం కలిగి ఉంటాయని అనుకుంటారు. అయితే వాటి కారణంగా పెరుగుతున్న మేధస్సుకు ఎటువంటి సంబంధం లేదని పరిశోధనలు నిరూపించాయి.

జ్ఞాన దంతాలతో కూడా పలు పంటి సమస్యలు ఎదురవుతాయని వెబ్‌ఎమ్‌డి నివేదికలో చెప్పారు. అయితే యుఎస్‌లో జ్ఞాన దంతాలను తొలగించడానికి ప్రతి సంవత్సరం 10 మిలియన్ల శస్త్రచికిత్సలు జరుగుతాయని నివేదికల్లో వెల్లడైంది. జ్ఞాన దంతాల వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిలో ఇన్ఫెక్షన్, దంతాల చుట్టూ దెబ్బతినడం, ఎముకల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు నష్టం వంటి సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు అంటున్నారు.. జ్ఞాన దంతాలు తొలగించిన తర్వాత మొదటి రోజు రక్తస్రావం జరగవచ్చని, లేదా కొంత సమయం పాటు వాపు కూడా అనిపించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అటువంటి సందర్భంలో కొంత సమయం వరకు బ్రష్‌ను ఉపయోగించకూడదని సలహా ఇస్తారు. దాదాపు 24 గంటల పాటు ఇలా చేయాలని చెబుతున్నారు. ఉప్పు నీటితో పుక్కిలించుకోవడం చేస్తుంటే..నొప్పి తగ్గుతుంది.

జ్ఞాన దంతాలు కలిగి ఉండటం అంటే తెలివితేటలు పెరగడం అనేది అస్సలు కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది. ఇది దంతాల చివరి భాగంలో ఉన్నందున దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్ల ఈ భాగంలో కొంచెం సమస్య ఉంటే నొప్పి ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అది మ్యాటర్..పులిహారలో పులి ఎలా అయితే ఉండదో..జ్ఞానదంతాలు వస్తేనే జ్ఞానం రాదు..ఈసారి ఎవరైనా జ్ఞానదంతాల వల్ల జ్ఞానం వస్తుందంటే..వాళ్లకి కరెక్ట్ సమాధానం చెప్పేయండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version